23May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఛత్తీస్‌గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గడ్ లోని నారాయణ్‌పూర్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే మరణించిన మావోయిస్టులు ఎవరన్నది ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు.

Update: 2024-05-23 12:58 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : ఛత్తీస్‌గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ .. ఏడుగురు మావోల మృతి

ఛత్తీస్‌గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గడ్ లోని నారాయణ్‌పూర్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే మరణించిన మావోయిస్టులు ఎవరన్నది ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు.

Ap Elections : పవన్ కల్యాణ్ నాడు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో నేడు సీన్ ఎలా ఉందంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన భీమవరం, గాజువాక ఈసారి కొంత టీడీపీకి ఎడ్జ్ ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగారు. అప్పుడు త్రిముఖ పోటీ జరిగింది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో జనేనాని ఓటమి పాలయ్యారు. ఆయన తొలిసారి రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగడం, రెండు చోట్ల ఓటమి పాలు కావడం ఆయన కూడా ఊహించలేదు.

Tadipathri : పల్నాడు పక్కన పెడితే.. తాడిపత్రి మాటేంటి? ఇక్కడ ఆ ఇద్దరు రెడ్ల సంగతేంటయ్యా?

మాచర్ల నియోజకవర్గంలో కేసులు నమోదయ్యాయి. పల్నాడులో అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేవలం పల్నాడు మాత్రమే కాదు.. తాడిపత్రిలోనూ ఇదే తరహాలో ఘటనలు జరిగాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. అక్కడ కూడా పెద్దయెత్తున ఘర్షణలు చెలరేగాయి. అయితే అక్కడ కూడా పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

బెజవాడ వాసు.. మామూలోడు కాదండోయ్..ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడో తెలిస్తే?

బెంగళూరు ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించిన వాసుది బెజవాడ. బెజవాడలో ఒక సామాన్య కుటుంబం నుంచి అడ్డదారిలో ఎదిగి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాసు అన్ని అసాంఘిక కార్యక్రమాలకు తెరతీశారంటారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అతి స్వల్ప కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించిన వాసు ఆస్తులను భారీగానే కూడబెట్టారని చెబుతున్నారు.

Pinnelli : పిన్నెల్లి పోలీసుల కన్ను గప్పి ఎలా వెళ్లిపోయారంటే?

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. పోలీసులు కన్నుగప్పి ఆయన పారిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లిందీ తెలియదు. దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఏపీ పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను పట్టుకునేందుకు ఏపీ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు బయలుదేరి వెళ్లాయి. తన అరెస్ట్ తప్పదని భావించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఇద్దరూ కలసి హైదరాబాద్ నుంచి జంప్ అయ్యారని పోలీసులు గమనించారు.

రాజకీయ వేదిక కూలి ఐదుగురు మృతి.. యాభై మందికి గాయాలు

మెక్సికోలో వేదిక కూలిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు. యాభై మందికి పైగా గాయాలయ్యాయి. మెక్సికో లో జూన్ రెండో తేదీన ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే మెక్సికోలోని న్యూవో లియోయన్ రాష్ట్రంలోని శాన్ షెడ్రో గార్సియాలో జరిగిన ఒక ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది.

Breaking : బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం.. చాలా మందికి పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మందికి నార్కోటిక్ పరిక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్న దానిపై రక్తనమూనాలను పోలీసులు సేకరించారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది నుంచి రక్తనమూనాలను పోలీసులు సేకరించి వారిని పంపించి వేశారు. అందులో డ్రగ్స్ ను విక్రయించిన కొందరిని మాత్రం పట్టుకున్నారు. 59 మంది పురుషలు, 27 మందికి పాజిటివ్ వచ్చినట్లు నార్కోటిక్ పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలిసింది.

బీఆర్ఎస్ మూతపడటం ఖాయం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

జూన్ తర్వాత బీఆర్ఎస్ మూతపడటం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడం గ్యారంటీ అని ఆయన అన్నారు. జూన్ 5వ తేదీ తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు నేతల వెంటపడి కొడతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటు కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2,911కోట్ల రూపాయలుగా పేర్కొంది.

Nirmal Road Accident : బోల్తాపడిన బస్సు.. ఒకరి మృతి.. ఇరవై ఐదుమందికి గాయాలు

నిర్మల్ జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించగా, ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం మహబూబాఘాట్ వద్ద బస్సు బోల్తా పడింది. ఈరోజు తెల్లవారు జాను జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఫర్మానా అనే యువతి మరణించింది. ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఒక ప్రయివేటు బస్సు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది.


Tags:    

Similar News