March27-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తెలంగాణలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టుకు నేడు భూమి పూజ జరగనుంది. రాజేంద్ర నగర్ లో కొత్తగా హైకోర్టు భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నారు. ఈ భవనాలను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-27 12:42 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Telangana High Court Bhoomi pooja: నేడు నూతన హైకోర్టు నిర్మాణానికి భూమి పూజ

తెలంగాణలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టుకు నేడు భూమి పూజ జరగనుంది. రాజేంద్ర నగర్ లో కొత్తగా హైకోర్టు భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నారు. ఈ భవనాలను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

BJP : చిన్నమ్మ దెబ్బకు వాళ్లంతా చిందరవందర.. అస్సలు కనిపించడమే లేదే?

దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టనంత వరకూ పార్టీలో ఒక సీన్ ఉండేది. కొందరిదే ఆధిపత్యం. వారి నిర్ణయాలే అంతిమం. అధినాయకత్వానికి వారు ఇచ్చే నివేదికలను బట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయాలు జరిగేవి. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో ఆ పార్టీతో కలసి ఎక్కడా పనిచేసిన దాఖలాలు లేవు.

Kalvakuntla Kavitha : కవిత అరెస్ట్ సానుభూతి తెస్తుందా? లేక నెగిటివ్ ను తెచ్చిపెడుతుందా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. ఆమెకు పదిహేను రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కల్వకుంట్ల కుటుంబంలో తొలి సారి కవిత అవినీతి కేసులో జైలుకెళ్లారు. ఉద్యమం సమయంలో వెళ్లడం వేరు. అవినీతి కేసులో జైలు ఊచలు లెక్కపెట్టడం వేరు.

ఈ ఆవు ఖరీదు నలభై కోట్లు.. ఎగరేసుకుపోయారు..ఏంటీ దీని స్పెషల్?

ఒక ఆవు ఖరీదు లక్ష లేకుంటే పది లక్షలుంటుంది. కాకుంటే ఇంకా మేలుజాతి ఆవు అయితే కోటి రెండు కోట్లు పలుకుతుంది. కానీ బ్రెజిల్ లో ఒక ఆవును నలభై కోట్ల రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీనిని నెల్లూరు జాతి ఆవు. నలభై కోట్ల రూపాయలకు అమ్ముడయి ఈ ఆవు రికార్డు సృష్టించింది. వయాటినా - 19 ఎఫ్ఐవీ మారా ఇమోవీస్ అనే ఆవు ఇంత పెద్దమొత్తంలో అమ్ముడు పోవడం ప్రపంచ రికార్డు అని చెబుతున్నారు.

భారీ ఎన్‌కౌంటర్ : ఆరుగురు మావోల మృతి

చత్తీస్‌ఘడ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టు మృతి చెందారు. ఇప్పటి వరకు ఒక డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నక్సలైట్లలో ఒక మహిళా నక్సలైట్ మృతదేహం కూడా ఉంది బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలో చీపుర్‌భట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది

Ram Charan : చరణ్ పుట్టినరోజు గిఫ్ట్‌గా.. క్లీంకార ఫేస్ రివీల్ అయ్యిపోయింది..

నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది. ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ లో ఉంటే.. రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుపతి వెళ్లారు. ఉపాసనతో పాటు ఆమె తల్లిదండ్రులు, క్లీంకార, రామ్ చరణ్ కలిసి నేడు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని అశీసులు తీసుకున్నారు. ఇక అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను మనీలాండరింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపడుతూ ఈ పిటీషన్ వేశారు. తన కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై సమాధానానికి ఎన్‌ఫోర్స్‌:మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఢిల్లీ హైకోర్టు సమయం ఇచ్చింది.

Ys Vijayamma : ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ.. జగన్ వెంటేనా?

వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆయన వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే వైఎస్ జగన్ వెంట జగన్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచార యాత్రకు సిద్ధమవుతున్నారు.

KTR : రేవంత్.. నీకు ఆ దమ్ముందా? నీ అంత పిరికోడు లేడు

రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజిగిరిలో పోటీకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే తాను కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన తెలిపారు.

IPL 2024 : ఆ ముగ్గురూ మడతెట్టేశారు.. చెన్నైకు బ్యాక్ టు బ్యాక్ విక్టరీని అందించారు

ఐపీఎల్ సీజన్ మొదలయిన తొలి మ్యాచ్ తోనే విక్టరీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్ ను కూడా అలవోకగా గెలిచింది. తొలి మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ను ఓడించగా, నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించింది. అలా ఇలా కాదు 63 పరుగుల భారీ తేడాతో ఓడించింది.



Tags:    

Similar News