హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు 7 నుంచి ప్రారంభం

ఈ నెల 7వ తేదీ నుంచి హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ తర్వాత మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం [more]

;

Update: 2020-09-02 01:33 GMT

ఈ నెల 7వ తేదీ నుంచి హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ తర్వాత మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 లో భాగంగా మెట్రో సర్వీసులకు పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్ లో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో మెట్రో సర్వీసులకు విపరీతమైన స్పందన లభించింది. లాక్ డౌన్ తో గత ఐదు నెలలుగా సర్వీసులు నిలిచిపోయాయి. తిరిగి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మెట్రో సర్వీసులు ప్రారంభించనున్నారు. 7వ తేదీ నుంచి తిరిగి హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు ప్రారభం కానున్నాయి.

Tags:    

Similar News