నేటి నుంచి హైదరాబాద్ లో మెట్రో పరుగులు

హైదరాబాద్ లో నేటి నుంచి మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. ప్రయాణికులను శరీర ఉష్ణోగ్రతను పరిశీలించిన తర్వాతనే [more]

Update: 2020-09-07 02:16 GMT

హైదరాబాద్ లో నేటి నుంచి మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. ప్రయాణికులను శరీర ఉష్ణోగ్రతను పరిశీలించిన తర్వాతనే రైళ్లలోకి అనుమతిస్తారు. రైళ్లలో కూడా భౌతిక దూరం పాటిస్తారు. గతంలో ప్రతి మూడు నిమిషాలకు ఉండే మెట్రో రైలును నేడు ఐదు నిమిషాలకొకసారి నడపనున్నారు. గతంలో రోజుకు లక్ష మంది మెట్రోరైలులో ప్రయాణించేవారు. కానీ కరోనా తీవ్రత దృష్ట్యా అంతమంది ప్రయాణానికి సుముఖత చూపరని భావించి పరిమిత సంఖ్యలో మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి రైళ్లను కూడా పెంచుతామని చెప్పారు.

Tags:    

Similar News