వరదను మ్యానిపులేట్ చేస్తారా?

కృష్ణా నది వరద పరిస్థితిని సమీక్షించేందుకు గత మూడు రోజుల నుంచి డ్రోన్లను ఇరిగేషన్ శాఖ వినియోగిస్తుందని ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. [more]

Update: 2019-08-16 08:53 GMT

కృష్ణా నది వరద పరిస్థితిని సమీక్షించేందుకు గత మూడు రోజుల నుంచి డ్రోన్లను ఇరిగేషన్ శాఖ వినియోగిస్తుందని ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా నదికి వరద పోటెత్తుతుండటంతో వరద పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్ల వినియోగం కరకట్టపై జరిగిందన్ అనిల్ కుమార్ తెలిపారు. కరకట్టపై ఉన్న ప్రజలను రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని గుర్తించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు వరద రాజకీయం చేస్తున్నారన్నారు. వరదను ఎవరైనా మ్యానిపులేట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News