RCBvsMI: ఆఖర్లో ముంబైకి.. హార్ట్ బ్రేక్
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో;

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినప్పటికీ ముంబై జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 4 వికెట్లు తీసుకోగా, యశ్ దయాళ్, హేజెల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు కోహ్లీ . జితేశ్ శర్మ 19 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు, పటీదార్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి భారీ స్కోరును అందించాడు.