Modi : భారత్ కొత్త చరిత్ర… ప్రజల సహకారంతోనే
భారత్ లో వందకోట్ల మందికి వ్యాక్సినేషన్ ను పూర్తి చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్టోబర్ 21 నాటికి ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇది భారతావని [more]
;
భారత్ లో వందకోట్ల మందికి వ్యాక్సినేషన్ ను పూర్తి చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్టోబర్ 21 నాటికి ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇది భారతావని [more]
భారత్ లో వందకోట్ల మందికి వ్యాక్సినేషన్ ను పూర్తి చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్టోబర్ 21 నాటికి ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇది భారతావని విజయమన్నారు. వ్యాక్సిన్ల విషయంలో భారత్ కొత్త చరిత్రను సృష్టించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయని మోదీ తెలిపారు. దేశ ప్రజలందరి సహకారం వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను మరువలేమని మోదీ తెలిపారు. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిందని మోదీ అభిప్రాయపడ్డారు.
అందరికీ వ్యాక్సిన్….
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా వ్యాక్సినేషన్ మన నినాదమని మోదీ తెలిపారు. భారత్ లో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేంత వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని మోదీ తెలిపారు. భారత విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ పెద్ద సమస్యగా మారిందన్నారు. కరోనా సమయంలో ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రయత్నించామన్నారు. రైతుల నుంచి వలస కూలీల వరకూ పథకాలతో వారికి ఊరట కల్పించామని మోదీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగా అందించామని చెప్పారు.