Telangana : తెలంగాణ సర్కార్ కు ఎన్జీటీ షాక్
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బ్రేక్ వేసింది. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. మహబూబ్ [more]
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బ్రేక్ వేసింది. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. మహబూబ్ [more]
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బ్రేక్ వేసింది. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కరివెన వద్ద ఈ ప్రాజెక్టును 2015 లో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు కృష్ణానది నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలన్న ఉద్దేశ్యంతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించతలపెట్టారు. దీని ద్వారా రంగారెడ్డిలో 2.7 లక్షలు, మహబూబ్ నగర్ లో ఏడు లక్షలు, నల్లగొండలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆదేశించింది.