సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టం.. నిర్మాణానికి రూ.70కోట్లు, కూల్చివేతకు రూ.20 కోట్లు

2009లో సూపర్ టెక్ లిమిలెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది. మూడేళ్లపాటు..

Update: 2022-08-28 12:02 GMT

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ అపెక్స్, సియాన్ భవంతులు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నేలమట్టమయ్యాయి. అధికారులు 3700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి 100 మీటర్ల దూరంలో ఒక బటన్ నొక్కి జంట భవనాలను కూల్చివేశారు. ప్రైమరీ బ్లాస్ట్ కు 7 సెకన్ల సమయం పట్టగా, సెకండరీ బ్లాస్ట్ 2 సెకన్ల సమయం పట్టింది. భవనాల కూల్చివేతతో ఎగిసిన దుమ్ము, ధూళి కొన్ని వందల కిలోమీటర్ల వరకూ వ్యాపించింది.

2009లో సూపర్ టెక్ లిమిలెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది. మూడేళ్లపాటు నిర్మించిన ఈ టవర్స్ నిర్మాణానికి రూ.70 కోట్ల వ్యయం అయింది. వీటిలో అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా ఇందులో 32 అంతస్తులున్నాయి. సియాన్ టవర్ ఎత్తు 95 మీటర్లు. రెండింటిలో కలిపి 915 ఫ్లాట్లు, 21 షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి.
నిబంధనలను ఉల్లంఘించి సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నిర్మించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవ్వగా.. ధర్మాసనం వాటిపై విచారణ జరిపింది. అక్రమంగా నిర్మించిన ఆ టవర్స్ ను కూల్చివేయాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కుతుబ్ మినార్, ఇండియా గేట్ కంటే ఎత్తయిన ఈ భారీ టవర్స్ ను కూల్చివేసేందుకు అధికారులు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. శిథిలాల తొలగింపునకు మరో రూ.13.5 కోట్లు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.


Tags:    

Similar News