తెలంగాణ చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.33 శాతం నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళి ఇలాగే కొనసాగితే గతంలో కంటే ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.