రాష్ట్రపతి వద్దకు రఘురామకృష‌్ణంరాజు
వైసీపీ ఎంపీ రఘురామకృష‌్ణంరాజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. తన భద్రత విషయమై చర్చించేందుకు రఘురామకృష‌్ణంరాజు రాష్ట్రపతిని కలిశారు. రఘురామకృష‌్ణంరాజుపై వరసగా పశ్చిమ గోదావరి [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష‌్ణంరాజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. తన భద్రత విషయమై చర్చించేందుకు రఘురామకృష‌్ణంరాజు రాష్ట్రపతిని కలిశారు. రఘురామకృష‌్ణంరాజుపై వరసగా పశ్చిమ గోదావరి [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష‌్ణంరాజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. తన భద్రత విషయమై చర్చించేందుకు రఘురామకృష‌్ణంరాజు రాష్ట్రపతిని కలిశారు. రఘురామకృష‌్ణంరాజుపై వరసగా పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రఘురామకృష‌్ణంరాజు దిష్టిబొమ్మలను కూడా జిల్లాలో దహనం చేస్తున్నారు. రఘురామకృష‌్ణంరాజు ఇంతకు ముందే తనకు భద్రత కల్పించాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష‌్ణంరాజు తనకు భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రపతి తనపై సానుభూతి ప్రకటించారని చెప్పారు. భద్రత కల్పించేంత వరకూ తనను ఢిల్లీలో ఉండాల్సిందిగా కోరారన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ పోరాం చేయాలని రఘురామకృష్ణంరాజు మీడియాతో అన్నారు.