రాహుల్ సంచలన ప్రకటన
ఎలాగైనా ఈసారి ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని భావిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాయపూర్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ [more]
ఎలాగైనా ఈసారి ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని భావిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాయపూర్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ [more]
ఎలాగైనా ఈసారి ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని భావిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాయపూర్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రకటన సొంత పార్టీలో నేతలను సయితం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పేదరికాన్ని నిర్మూలించకపోతే నవభారత నిర్మాణం జరగదని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోని పేదలందరికీ నిర్దిష్ట ఆదాయాన్ని అందజేస్తామని చెప్పారు. ఎంత ఇస్తారో చెప్పకపోయినప్పటికీ ప్రభుత్వం పేదవారి బ్యాంకు అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తుందని తెలిపారు. ఆకలితో అలమటిస్తున్న పేదలను ఈ పథకం ద్వారా ఆదుకుంటామని రాహుల్ స్పష్టం చేశారు. పేదలకు కనీస ఆదాయం లేకపోతే నవభారత నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని, పేదరిక నిర్మూలనలో మోదీ విఫలమయ్యారని ఆయన ఫైర్ అయ్యారు.