బాబుకు షాక్… ఏం జరిగిందంటే?

తెలుగుదేశం పార్టీకి భారీగా షాకిచ్చారు బీజేపీనేతలు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ ఎలాంటి పొత్తు ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. వచ్చే ఎన్నికల [more]

;

Update: 2019-10-30 05:11 GMT

తెలుగుదేశం పార్టీకి భారీగా షాకిచ్చారు బీజేపీనేతలు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ ఎలాంటి పొత్తు ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని రామ్ మాధవ్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం రామ్ మాధవ్ బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏపీలో బీజేపీ ఎదుగుతుందని రామ్ మాధవ్ తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తుతో వెళదామనుకుంటున్న చంద్రబాబుకు రామ్ మాధవ్ కామెంట్స్ షాక్ ఇచ్చేవిగానే ఉన్నాయి.

Tags:    

Similar News