Ys jagan : జగన్ మాకు మంచి మిత్రుడు.. కేంద్ర మంత్రి కామెంట్స్

జగన్ తమకు మంచి మిత్రుడని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. వైసీపీ ఎన్డీఏలో చేరేతేనే ప్రయోజనం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో కేంద్ర మంత్రి రాందాస్ [more]

;

Update: 2021-10-17 12:54 GMT

జగన్ తమకు మంచి మిత్రుడని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. వైసీపీ ఎన్డీఏలో చేరేతేనే ప్రయోజనం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర భాగస్వామ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే వైసీపీ ఎన్డీఏలో చేరాలని అథవాలే పిలుపునిచ్చారు.

మూడు రాజధానుల అంశం….?

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై కూడా రాందాస్ అథవాలే స్పందించారు. ప్రయివేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఇబ్బంది జరుగుతందన్నారు. రిజర్వేషన్లకు నష్టం జరగకుండా తాము పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశామని అథవాలే తెలిపారు. మూడు రాజధానుల అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని కూడా ఆయన తెలిపారు.

Tags:    

Similar News