Sajjala : బాబు దీక్షపై సజ్జల ఏమన్నారంటే?

చంద్రబాబు దీక్షకు దిగితే పట్టుమని పది మంది కూడా స్పందించడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న దీక్షను చూస్తే నవ్వాలో [more]

;

Update: 2021-10-21 07:42 GMT

చంద్రబాబు దీక్షకు దిగితే పట్టుమని పది మంది కూడా స్పందించడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న దీక్షను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థంకాకుండా ఉందన్నారు. చంద్రబాబును పట్టాభి అన్న మాట అంటే ఊరుకుంటారా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా? అని ఆయన నిలదీశారు.

వీధి రాజకీయాలు చేయబోం….

విజయవాడలో జరుగుతున్న వైసీపీ జనాగ్రహ దీక్షలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదని అన్నారు. తాము ప్రజా సేవ చేయడానికి ఉన్నామని, వీధి రాజకీయాలు చేయడానికి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేక అడ్డదారుల్లో అరాచకాలను సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టాభి మాటలను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News