తెలంగాణలో భారీ స్కామ్..అరెస్ట్

వరంగల్ కేంద్రంగా ఈఎస్ఐ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒక స్వచంద్ద సంస్ద వెలుగులోకి తెచ్చిన ఈ స్కామ్ పైన ప్రభుత్వం విచారణ జరిపింది. రెండు వందల కోట్లకు [more]

Update: 2019-09-27 03:43 GMT

వరంగల్ కేంద్రంగా ఈఎస్ఐ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒక స్వచంద్ద సంస్ద వెలుగులోకి తెచ్చిన ఈ స్కామ్ పైన ప్రభుత్వం విచారణ జరిపింది. రెండు వందల కోట్లకు పైగా ఈ స్కామ్ ఉంటుందని అధికారుల అంచనా. ఇప్పటి వరకు పది కోట్ల రూపాయల వరకు మందులు కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు అధికారికంగా చెప్పారు. ఈ స్కామ్ పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ స్కామ్ కీలకంగా వున్న మెడికల్ డైరెక్టర్ దేవికా రాణితో సహా ఇరవై రెండు మంది ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఇందులో ప్రయివేట్ వ్యక్తులు కూడా వున్నారు. ఈ స్కామ్ లో ఒక జర్నలిస్ట్ కూడా కీలక పాత్ర పొషించారని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ జర్నలిస్ట్ ఇంటిపైన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈఎస్ఐ కి మందులు కొనుగోళ్లలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఏసీబీ ప్రకటించింది. ఈఎస్ఐ స్కామ్ పైన ఏసీబీ సమగ్రంగా విచారణ చేస్తుంది. రెండు నెలల నుంచి ఈఎస్ఐ మందుల కొనుగొలు స్కామ్ పైన అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేసింది. . సచివాలయం సిబ్బంది నుంచి డైరెక్టర్ కార్యాలయం వరకు ఉన్న అధికారుల హస్తం వుందని ఏసీబీ చెబుతుంది. కోట్ల రూపాయల మందుల కొనుగోలు అక్రమాలపై ఇప్పడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ పైన ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. రెండు నెలల పాటుగా విచారణ లో స్కామ్ జరిగిన ట్లుగా ఏసీబీ తెల్చింది. ఈ స్కామ్ వెనుకాల డైరెక్టర్ దేవికా రాణి వున్నట్లుగా అధికారులు తేల్చారు.

ప్రయివేటు వ్యక్తులు కూడా…..

ముందుగా ఈఎస్ ఐ మందులు కొనుగొలో భారీ అక్రమాలు జరిగినట్లుగా విజిలెన్స్ చేసిన విచారణ లో తెలింది.,రాష్ట్రంలో వున్న డిస్పెసరి నుంచి ఆసుపత్రిల వరకు కూడా ఈ స్కామ్ జరిగినట్లుగా తెల్చింది. అవసరం లేక పొయినా మందులను కొనుగోలు చేసినట్లుగా బయట పడింది. ముఖ్యంగా ఎక్కడా ఉపయోగం లేని మందులను కూడా ఈ డైరెక్టర్ మెడికల్ శాఖ కొనుగోలు చేసింది. ప్రధానగా కొన్ని డిస్పెన్సరీలో ఇప్పటి వరకు ఉపయోగం లేని , వాటి అవసరం లేక పొయినప్పటికి కూడా మందులను కొన్నారని విజిలెన్స్ విచారణ లో తెలింది. విజిలెన్స్ డిపార్ట్ మెంట్స్ చేసిన విచారణ ను వెంటనే ప్రభుత్వానికి సమర్పించింది. దీనిని సిరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే విచారణ కు ఆదేశించింది. రెండు నెలల నుంచి కూడా ఏసీబీ సమగ్రంగా విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వంకు నివెదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఎస్ఐ స్కామ్ పైన అవినీతి నిరోధక శాఖ విచారణ ప్రారంభించింది. గత నెల రొజుల నుంచి కూడా విచారణ చేస్తుంది. ముషీరా బాద్ లో ఉన్న డైరెక్టర్ కార్యాలయంలో ఎసిబి అధికారులు విచారణ చేశారు. మొత్తం పది కోట్ల రూపాయల వరకు స్కామ్ వుంటుందని అధికారులు చెబుతుంటే అనధికారికంగా దాదాపుగా వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఈస్కామ్ జరిగిందని ఒక అంచనా. అంతేగాకుండా ఇందులో ప్రయివేట్ వ్యక్తులు పెద్ద మొత్తంలో లాభ పడినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇరవై ఒక్క మందిపైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ను ఏసీబీ నమోదు చేసింది. దేవికా రాణికి బినామీ గా వ్యవహారించిన ఒక ప్రయివెట్ ఛానల్ రిపొర్టర్ పైనా ఎసిబి కేసులు నమోదు చేసి సోదాలు చేశారు. దేవికారాణిని అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News