ఏసీబీ సోదాలు

తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు చేసింది . ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మధుసూదన్ రెడ్డి ఇంట్లో [more]

Update: 2019-10-04 08:53 GMT

తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు చేసింది . ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మధుసూదన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది . మధుసూదన్ రెడ్డి తో పాటు అతని సమీప బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తున్నారు. మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తునట్లు అధికారులు వెల్లడించారు. పదవిని అడ్డంపెట్టుకుని మధుసూదన్ పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిన ఆరోపణలు ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి బంధువుల పేర్లమీద ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చాలా వరకు బంధువుల పేరుతో ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారుకు సమాచారం. మరోవైపు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

 

Tags:    

Similar News