Gold Price Today : దీపావళి ఎఫెక్ట్ : మళ్లీ ఎనభై వేలు దాటిన బంగారం.. లక్ష పదివేల చేరువలో వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరగడం కనిపించింది

Update: 2024-10-31 03:35 GMT

gold price today in hyderabad

పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. మన ఆనందానికి అవధులు లేనట్లే.. బంగారానికి కూడా ఒక పరిమితి ఉండదు. అది పెరుగుతూనే పోతుంటుంది. ధరలు పెరుగుతూ వినియోగదారులను షాక్ కు గురి చేస్తుంటాయి. అయితే దీపావళికి ధరలు పెరుగుతాయని అందరూ ఊహించిందే. ఇటు పెళ్లిళ్ల సీజన్, అటు పండగ కావడంతో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని, డిమాండ్ అధికం కావడంతో ధరలు కూడా పెరుగుతాయని ముందుగా ఊహించిందే అయినప్పటికీ ప్రతి రోజూ ధరలు పెరుగుతూ వినియోగదారులను నిరాశపరుస్తున్నాయి. కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే దాదాపు ఇరవై నుంచి ముప్ఫయి శాతం వరకూ తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

కొనుగోళ్లు తగ్గినా...
సహజంగా ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలంటే ఇంట్లో పెళ్లి మాత్రమే జరగాలని లేదు. పుట్టిన రోజు నాడు కూడా బంగారం కొంటున్నారు. చిన్న ఫంక్షన్ కూడా బంగారాన్ని బహుమతిగా తమ దగ్గర వారికి ఇవ్వడం ఒక అలవాటుగా మారింది. తమకు సన్నిహితులైన వారికి గోల్డ్్ తో సర్‌ప్రైజ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. అయితే పెరుగుతున్న ధరలను చూసి బహుమతులు కూడా బంగారం విషయంలో తగ్గాయి. ఒకప్పుడు ప్లాటినం ధరలు బంగారం ధరలకు మించి ఉండేవి. కానీ ఇప్పుడు పెరిగిన ధరలను చూసిన తర్వాత ప్లాటినం ధర చాలా అందుబాటులో ఉంది. బంగారం ధర దానిని మించి అందకుండా పోయింది.
పెరిగిన ధరలు...
అందుకే ఇప్పుడు ప్లాటినం నగలు ధరించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుగోలు చేయడం తగ్గిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బంగారం, వెండి ధరలు పరుగును చూసి వ్యాపారులే ఆశ్చర్యపోతున్నారు. అయితే ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరగడం కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,410 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,170 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,09,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News