Andhra Pradesh : నేడు ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ కు నేడు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ చేసింది.

Update: 2024-10-31 02:58 GMT

ఆంధ్రప్రదేశ్ కు నేడు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు ఉత్తర కోస్తా, రాయలసీమల ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు, తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారుగానూ, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీగానూ వర్సాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

వరస వర్షాలతో...
ఆంధ్రప్రదేశ్ కు వర్షాల భయం వీడటం లేదు. ఏదో ఒక ఆవర్తనమో, అల్పపీడనమో ఏర్పడుతుండటంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే నేడు దీపావళి పండగ రోజు కావడంతో పండగ రోజు వర్షం పడితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆనందంతో టపాసులు పేల్చుకునే పండగ కావడంతో వర్షం ఎక్కడ వచ్చి తమ ఆనందాన్ని ఆవిరి చేస్తుందేమోనన్న భయం అందరిలోనూ ఉంది. అయితే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అనేకచోట్ల ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో కొంత వరకూ ఊపిరి పీల్చుకున్నారు.
నేడు ఈ జిల్లాల్లో....
ఈరో్జు కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి,చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ పలు ప్రాంతాల్లో తేలిక పాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశమున్నందున పొలాల్లో పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.



Tags:    

Similar News