Trs : ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో అంత సైలెన్స్ ఎందుకో?

హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయింది. అయితే పోలింగ్ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం కన్పించడం లేదు. నేతలందరూ సైలెంట్ గానే ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు [more]

Update: 2021-10-31 07:37 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయింది. అయితే పోలింగ్ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం కన్పించడం లేదు. నేతలందరూ సైలెంట్ గానే ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం గెలుపు పై ఆత్మవిశ్వసంతో ఉన్నారు. ఈటల రాజేందర్ పది నుంచి పదిహేను వేల మెజారిటీతో విజయం సాధిస్తారని చెబుతున్నారు. పోలింగ్ శాతం పెరగడంతో తమ గెలుపు ఖాయమయిందని వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగానే వచ్చాయి. అధికార పార్టీ, బీజేపీల మధ్య తేడా తక్కువగా ఉన్నా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తూ హడావిడి చేస్తున్నారు.

Tags:    

Similar News