కోర్టుకు హాజరైన మంత్రి బొత్స

అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన వోక్స్ వ్యాగన్ కేసు ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులోవిచారణకు వచ్చింది. సాక్షిగా మంత్రి బొత్స సత్యనారాయణ [more]

Update: 2019-09-24 06:16 GMT

అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన వోక్స్ వ్యాగన్ కేసు ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులోవిచారణకు వచ్చింది. సాక్షిగా మంత్రి బొత్స సత్యనారాయణ కోర్టుకు హాజరయ్యారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ జర్మన్ కంపెనీ వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు రూ. 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణంలో సిబిఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో నలుగురిపై సిబిఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సిఇవో లపై సిబిఐ అభియోగాలు మోపింది.

3వేల పేజీల ఛార్జ్ షీట్……

విశాఖపట్నంలో కార్ల ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్ వ్యాగన్ కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్ కు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించింది. వశిష్ట వాహన్ సిఇవో సూష్టర్ తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. దీంతో వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో కుంభకోణం వెలుగు చూసింది. అప్పుడు బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. 2005లో వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీబీఐ మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసింది. 3 వేల పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారణ చేసింది. ఈ కేసులో 7 కోట్లు ఇప్పటి వరకు రికవరీ చేసింది. సీబీఐ ఇంకా 4 కోట్లు రికవరీ కోసం విచారణ చెపడుతోంది.

 

Tags:    

Similar News