కత్తులతో పొడుచుకున్న అగ్రహీరోల అభిమానులు

హీరోలపై పిచ్చి అభిమానం అభిమానుల మధ్య యుద్ధానికి కారణమైంది. అన్ని భాషల్లోని హీరోలకు అభిమానులు ఉంటారు కానీ, తమిళ హీరోలకు మాత్రం వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన [more]

;

Update: 2019-01-10 06:43 GMT
war between rajanikanth ajith fans
  • whatsapp icon

హీరోలపై పిచ్చి అభిమానం అభిమానుల మధ్య యుద్ధానికి కారణమైంది. అన్ని భాషల్లోని హీరోలకు అభిమానులు ఉంటారు కానీ, తమిళ హీరోలకు మాత్రం వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోలను దేవుడిలా భావిస్తారు. అయితే, ఇవాళ కోలీవుడ్ లో రజనీకాంత్ నటించిన పేటతో పాటు అజీత్ నటించిన విశ్వాసం సినిమాలు విడుదలయ్యాయి. రెండు పెద్ద సినిమాలే, పెద్ద హీరోల సినిమాలే. ఇద్దరికీ తమిళనాడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రాల విడుదల సందర్భంగా వేలూరులో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాలు కత్తులతో పొడుచుకున్నారు. నలుగురి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

rajanikanth petta

 

Tags:    

Similar News