వారానికి 4,5 రోజులే పని దినాలు.. మన దేశంలో కూడా..

జీవితంలో మనకు అన్నీ ముఖ్యమే, మనకంటూ ఒక కుటుంబం ఉండాలి. వారితో చిన్న సంతోషాలు ఉండాలి. కష్ట సుఖాలను పంచుకునేందుకు ..

Update: 2023-08-19 05:58 GMT

జీవితంలో మనకు అన్నీ ముఖ్యమే, మనకంటూ ఒక కుటుంబం ఉండాలి. వారితో చిన్న సంతోషాలు ఉండాలి. కష్ట సుఖాలను పంచుకునేందుకు మిత్రులు సైతం ఉండాలి. రేపు భవిష్యత్తు బాగుండాలని తమ ఇల్లును, కుటుంబ సభ్యులను విడిచి దూరంగా కూడా బ్రతుకుతారు. తమ వాళ్లను సుఖంగా ఉంచాలని అహర్నిశలు శ్రమిస్తారు. ఈ ధ్యాసలో పడి తమ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను కోల్పోతారు. ఇలాంటి సమయంలో ప్రతి ఉద్యోగికి వారానికి సెలవు కావాల్సిందే. అదే వారానికి కేవలం ఐదు రోజుల మాత్రమే వర్కింగ్‌ డేస్‌ ఉంటే ఎలా ఉంటుంది.? ఎంతో సరదగా ఉంటుంది. కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఇంటిల్లిపాదితో సంతోషంగా గడపవచ్చు. ఇలాంటి పద్దతులను ఇతర దేశాలే కాకుండా మన దేశంలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కంపెనీ. ఈ వారానికి ఐదు రోజులపాటు పది దినాల పద్దతిని తీసుకువస్తున్నాయి పలు కంపెనీలు. ముఖ్యంగా ఈ విధానం సాఫ్ట్‌వేర్‌ రంగంలో వచ్చింది. వారానికి కేవలం ఐదు రోజుల పాటు వర్క్‌ చేసి రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తున్నాయి కంపెనీలు. ఈ విధానం కార్పొరేట్‌ సంస్థల్లో ఎక్కువగా ఉన్నా.. మెల్లమెల్లగా ఇతర సంస్థలు కూడా పాటించేందుకు ముందుకు వస్తున్నాయి.

మన భారతదేశంలో చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు వారివారి ఉద్యోగులకు వారానికి 5 వర్కింగ్‌ డేస్‌ను అమలు చేస్తున్నాయి. దీని వల్ల ఉద్యోగులకు వారానికి రెండు రోజులపాటు హాలిడేస్‌ రానున్నాయి. తాజాగా ఎల్‌ఐసీ, బ్యాంకింగ్‌ ఉద్యోగులకు కూడా వారానికి 5 రోజుల పాటు పని దినాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ పలు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పాటు పని దినాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక హైదాబాద్‌లో మాత్రం సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు వారంలో 5 రోజుల వర్కింగ్‌,2 రోజుల పాటు సెలవులు ఇస్తున్నాయి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసి, శని, ఆదివారాల్ల సెలవులు ఇస్తున్నాయి. ఈ విధానాన్ని మరిన్ని సంస్థలు పాటించే అవకాశం ఉంది.

మూడు రోజుల పని దినాలతో మరో కంపెనీ ముందుకు..

ఇదిలా ఉంటే.. ఐటీ ఉద్యోగం చక్కటి జీతం. వారానికి 5రోజులే వర్కింగ్ డేస్. కానీ ఇటీవల ఓ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి మా కంపెనీ ఉద్యోగులు వారానికి కేవలం మూడు అంటే మూడు రోజులే పనిచేస్తే సరిపోతుంది అంటూ ప్రకటించింది. టెక్నాలజీ ఎంత విస్తరిస్తుంటే అవకాశాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీస్​ నేర్చుకున్న వారికి ఐటీ కంపెనీలు పెద్ద పీఠ వేస్తున్నాయి. వారి కోసం భారతదేశంలోని టెక్‌ స్టార్టప్స్‌లో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బిలియన్ల కొద్ది డాలర్లు గుమ్మరిస్తున్నారు. అంటే వారానికి నాలుగు రోజులు ఖాళీయే అన్నట్లు. బెంగళూరులోని ఫిన్‌టెక్‌ కంపెనీ స్లైస్‌ కంపెనీ తమ కంపెనీలో వారంలో మూడు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అంటూ ప్రకటించింది. అలాగని జీతంలో కోతలు కూడా ఏమీలేవు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ రేటులో 80 శాతం జీతంగా ఇస్తామంటూ స్లైస్‌ కంపెనీ ప్రకటించింది. దీని కోసం స్లైస్ కంపెనీ ఏమంటోందంటే..ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ టైమ్ లభించటంతో తమ ఇంట్రెస్టులు, అభిరుచులను ఆస్వాదించవచ్చని తెలిపింది.

స్లైస్ కంపెనీలో ఇప్పటికే దాదాపు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే మూడు ఏళ్లలో మరింత మంది ఉద్యోగుల్ని నియమించుకోవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇటువంటి ఆఫర్ ను ప్రకటిచిందీ కంపెనీ. రానున్న మూడేళ్లలో 1,000 మందికిపైగా ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను నియమించే ఆలోచనలో ఉంది స్లైస్ కంపెనీ. ఈ మూడు రోజుల పనితోనూ ఉద్యోగులు పూర్తి ప్రయోజనాలు, పూర్తిజీతం పొందవచ్చు.

ఈ విధానం ఎలా తెరపైకి వచ్చింది..?

కాగా.. మూడు రోజుల వర్కింగ్ డేస్ అనే కాన్సెప్ట్‌ అనేది చాలాకాలం నుంచి ఉంది. 1926లో మొదటిసారి హెన్రీ ఫోర్డ్ ఐదు రోజుల పని దినాల విధానాన్ని ప్రవేశపెట్టారు. అలా వర్కింగ్ డేస్ తగ్గించడం వల్ల ఉత్పాదకతలో తరుగుదల ఏమైనా ఉంటుందా? అనే కోణంలో ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. అలాగే పలు దేశాలు.. పలు కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలపై ప్రయోగాలు చేశాయి. అంటే కొన్ని సంత్సరాలపాటు నాలుగురోజుల వర్కింగ్ డేస్ తో పనిచేస్తూ బేరీజు వేసుకున్నాయి. కానీ తక్కువ పనిదినాలతో చక్కటి ఆదాయాలు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

తక్కువ పని రోజులతో ఉద్యోగి ఉత్పాదకత పెరుగుతోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటువంటి విధానానికి ఐర్‌ర్లాండ్‌, ఐస్‌ల్యాండ్‌ వంటి దేశాలు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని దేశాల్లో పలు కంపెనీలు వారి వారి ఉద్యోగులకు రెండు, మూడు, నాలుగు రోజుల పని దినాలు కల్పిస్తున్నాయి. అమెజాన్ కంపెనీ 2018 నుంచి కంపెనీ సెలెక్ట్ చేసిన కొంతమంది ఉద్యోగులకు వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ అమలు చేస్తోంది. అలాగే వర్కింగ్ డేస్ తగ్గించటానికి భారత్ సరిహద్దు దేశమైన చైనా కూడా ఆ దిశగా యత్నాలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీ తరహాలోనే ఇండియన్‌ స్టార్టప్‌ రంగం కూడా ఇటువంటి విధానం అమలు చేయటానికి యత్నిస్తోంది. ఇంజినీర్ల వేతనాలు గత మూడేళ్లలో మూడు రెట్లు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణులైన ఉద్యోగుల కోసం కంపెనీలు యుద్ధాలే చేస్తున్నాయి. అటువంటివారిని దక్కించుకోవటానికి భారీ భారీ జీతాలిచ్చి నియమించుకుంటున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో వర్క్‌ ఫ్రమ్‌ హోంకే పరిమితమైన ఉద్యోగులు ఇప్పుడు కార్యాలయాల బాట పట్టారు.

వారానికి పని దినాలు తగ్గినా కుటుంబానికి దూరంగానే..

కాగా, మరి వారానికి 4 వర్కింగ్‌ డేస్‌,5 వర్కింగ్‌ డేస్‌ విధానాన్ని కల్పిస్తుండగా, ఉద్యోగులకు ఏకంగా 2,3 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. మరి ఈ రోజుల్లో రెండు,మూడు రోజుల పాటు సెలవుల్లో ఉండే ఉద్యోగులు కుటుంబంతో గడపకుండా పబ్బులు, సినిమాలు, షికార్లు చేస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడిపే ఉద్యోగులు తక్కువ అయిపోయారు. కుటుంబానికి అతి తక్కువ సమయం గడిపే ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో పలు కంపెనీలు ఈ పని దినాలు తగ్గించే విధానం అమలు చేయడంతో కుటుంబ సభ్యులతో గడపడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఉద్యోగులు ఇన్ని రోజుల సెలవులు వస్తున్నా.. కుటుంబానికి దూరంగానే సమయాన్ని గడుపుతున్నవారు చాలా మంది ఉన్నారు. మరి కుటుంబ సభ్యులతో గడిపితే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పబ్బులు, సినిమాలు, ఇతర ఎంజాయ్‌మెంట్‌ కంటే కుటుంబ సభ్యులతో గడపడమే మేలంటున్నారు.

వారానికి నాలుగు రోజుల పది దినాలు కల్పిస్తున్న దేశాలు

☛ నెదర్లాండ్స్‌: ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ దేశంలో వారానికి29 గంటలు మాత్రమే పని దినాలు కల్పిస్తోంది. నెదర్లాండ్స్‌లో ప్రపంచంలోనే అతి తక్కువ సగటు పని వారాల్లో ఒకటిగా ఉంది. అధికారిక నియమాలు లేనప్పటికీ 4 రోజుల వర్కింగ్‌ డేస్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది ఈ దేశం.

☛ డెన్మార్క్‌: వారానికి కేవలం 33 గంటలు. డెన్మార్క్‌ ప్రపంచంలో 2వ అతి తక్కువ సగటు పనివారాన్ని కలిగి ఉందని OECD నివేదిక సూచిస్తోంది. డెన్మార్క్‌లో కూడా దీనికి అధికారిక నియమాలు ఏవి లేవు. ఇక్కడ చాలా మంది ప్రజలు దేశంలో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేస్తున్నారు.

☛ బెల్జియం: 2022లో ప్రారంభమైన బెల్జియన్‌ ప్రభుత్వం కొత్త మార్కెట్‌ లేటర్‌ సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇది కార్మికులు వారానికి కేవలం 4 రోజుల పనిని ఎంచుకోవడానికి అనుమతి ఇస్తుంది. కానీ నాలుగు రోజుల వారానికి 4x10గంటలు మాత్రమే వర్క్‌ చేయాలి.

☛  ఆస్ట్రేలియా:ఫైనాన్స్‌ నుంచి ఫ్యాషన్‌ వకకు ఆస్ట్రేలియాలో పలు కంపెనీలలో నాలుగు రోజుల పని వారం పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆస్ట్రేలియన్‌ చట్టం ప్రకారం.. ఉద్యోగులు వారానికి గరిష్టంగా 38 గంటలు పని చేయాలని యజమాని ఆశించవచ్చు.

☛ ఐర్లాండ్: ఐర్లాండ్ తన పైలట్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. వారానికి పనిదినాలు తగ్గించడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇది ఉద్యోగులకు వేతనంలో నష్టం లేకుండా, నాలుగు రోజుల పని రోజులు కల్పిస్తోంది. ఈ విధానం జనవరి 2022లో ప్రారంభమైంది.

☛ జపాన్‌: ఇక్కడ తీవ్రమైన వర్కింగ్‌ సంస్కృతికి దూరంగా, జపాన్‌ నాలుగు రోజుల పని రోజుల పద్దతిని ప్రోత్సహించడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జపాన్‌ 2021లో వార్షిక ఆర్థిక విధానం నిరోధించడానికి ఉద్యోగులకు నాలుగు రోజుల పని దినాలు కల్పిస్తోంది.

☛ స్పెయిన్‌: స్పానిష్‌ ప్రభుత్వం ఉద్యోగులకు వారానికి నాలుగు రోజుల పని దినాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రయల్‌ ప్రోగ్రామ్‌లో 50 మిలియన్‌ యూరరోలు పెట్టుబడులు పెడుతోంది. ఇందులో 200 కంపెనీలు పాల్గొంటున్నాయి.

☛ యునైటెడ్‌ కింగ్‌డమ్‌: యూకే 2022లో నుంచి పలు కంపెనీలకు ఉద్యోగులు వారానికి కేవలం 4 రోజుల పని దినాలను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ దేశం. చట్టం ప్రకారం ఉద్యోగులు వారంలో ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేకుండా నాలుగు రోజులు మాత్రమే ఇచ్చింది.

☛ యూఏఈ: ఇక్కడ కూడా ఉద్యోగులకు పని దినాలు తగ్గించాయి కంపెనీలు. వారానికి కేవలం 4 రోజులు మాత్రమే వర్కింగ్‌ డేస్‌ పద్దతిని అమలు చేస్తున్నాయి.

☛ ఐస్‌లాండ్‌: ఇక్కడ ఉద్యోగులతో పని దినాలు తగ్గించుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్‌ను నిర్వహించింది. ఇందులో మంచి ఫలితాలు రావడంతో పలు కంపెనీలు ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని దినాలు కల్పిస్తోంది. ఈ ట్రయల్‌లో ఐస్‌లాండ్‌లోఇన 2500 మంది కార్మికులపై అధ్యయం చేసి మంచి ఫలితాలను సాధించింది. దీంతో ఉద్యోగులకు నాలుగు రోజుల పని దినాలు కల్పిస్తోంది.

☛ స్కాట్లాండ్: ఐస్‌లాండ్ యొక్క నాలుగు రోజుల పని వారం విజయవంతం అయిన తర్వాత స్కాట్లాండ్ కూడా పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునే కొత్త మార్గాన్ని ప్రయత్నించడానికి 4-రోజుల పని వారం దేశాల క్లబ్‌లో చేరింది. నివేదికల ప్రకారం, దేశం నాలుగు రోజుల వారం పని దినాలు, మూడు రోజుల సెలవును అనుభవిస్తున్నారు ఉద్యోగులు.

☛ న్యూజిలాండ్: గత మూడు సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ యజమానులు నాలుగు రోజుల పని వారం, ఇతర సౌకర్యవంతమైన పని ఎంపికలను పరిగణించాలని సూచించారు. బర్న్స్ కంపెనీ పెర్పెచువల్ గార్డియన్‌లోని సిబ్బంది 2018 నుండి వారానికి నాలుగు రోజులు పని చేస్తున్నారు. వారు నాలుగు రోజుల పద్దతిని అమలు చేశారు.

☛ ప్రపంచంలోని ఈ దేశాలే కాకుండా మరిన్ని దేశాలు కూడా తమ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వారానికి కేవలం మూడు రోజులు, నాలుగు రోజులు, ఐదు రోజులు పని దినాలు కల్పిస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఉద్యోగులకు రెండు రోజులు మాత్రమే పని దినాలు కల్పిస్తూ కొత్త సంస్కరణలను అమలు చేస్తున్నాయి.


Tags:    

Similar News