ఏపీలో నిరుద్యోగం.. పేదరికం పెరిగింది

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం, పేదరికం పెరిగిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్ చేతకాని పాలన వల్లనే ఇది జరిగిందన్నారు. రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం, [more]

;

Update: 2021-03-21 01:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం, పేదరికం పెరిగిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్ చేతకాని పాలన వల్లనే ఇది జరిగిందన్నారు. రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం, 20 శాతానికి పేదరికం చేరిందని యనమల రామకృష్ణుడు చెప్పారు. ఏపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకపోవడం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో నిరుద్యోగం పెరిగిందన్నారు. అన్నాక్యాంటిన్లు మూసివేత, పండగల కానుకల రద్దుతో పేదల పరిస్థితి మరింత దిగజారిందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రతీకారాలు మాని అభివృద్ధి , సంక్షేమంపై దృష్టిపెట్టాలని యనమల రామకృష్ణుడు కోరారు.

Tags:    

Similar News