Yanamala : రాష్ట్రపతి పాలనకు ఇదే సరైన సమయం
ప్రభుత్వం ఆదేశాలు, పోలీసుల అండతోనే రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన [more]
;
ప్రభుత్వం ఆదేశాలు, పోలీసుల అండతోనే రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన [more]
ప్రభుత్వం ఆదేశాలు, పోలీసుల అండతోనే రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కై లా అండ్ ఆర్డర్ ను బ్రేక్ చేశారని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పార్టీ కార్యాలయాలకే రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 356 వినియోగానికి ఇదే సరైన సమయమని యనమల రామకృష్ణుడు అన్నారు. వెంటనే ఏపీ లో రాష్ట్ర పతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.