Ys jagan : దాడులపై జగన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో పథకం ప్రకారమే కుట్రకు విపక్షాలు తెరలేపుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పథకం ప్రకారం అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా [more]
;
రాష్ట్రంలో పథకం ప్రకారమే కుట్రకు విపక్షాలు తెరలేపుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పథకం ప్రకారం అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా [more]
రాష్ట్రంలో పథకం ప్రకారమే కుట్రకు విపక్షాలు తెరలేపుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పథకం ప్రకారం అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా అని జగన్ ప్రశ్నించారు. తన వాళ్లు గెలవలేదని ఒక వర్గం మీడియా రాష్ట్రంలో అలజడులు రేపాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. డ్రగ్స్ తో ఏపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా పదే పదే విమర్శలు చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.
ఎవరినీ వదలొద్దు….
శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి అని చూడకుండా బూతులు తిడుతున్నారని జగన్ అన్నారు. తనను అభిమానించేవాళ్లు తిరగబడి గొడవలు సృష్టించాలనే ఇలా వ్యహరిస్తున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని జగన్ అన్నారు. నేరాల్లో కొత్త కోణం కన్పిస్తుందని, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ ప్రసంగించారు.