Ys jagan : జగన్ విశాఖ పర్యటన రద్దు చేసుకుంది అందుకేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన రద్దయింది. ఈరోజు జగన్ విశాఖపట్నంకు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే జగన్ తన పర్యటనను [more]

;

Update: 2021-10-23 03:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన రద్దయింది. ఈరోజు జగన్ విశాఖపట్నంకు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ పర్యటన రద్దు పై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్ కేంద్ర ప్రభుత్వం పెద్దలతో అపాయింట్ మెంట్ తీసుకోవడానికే తన పర్యటనను రద్దు చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. సోమవారం చంద్రబాబు ఢిల్లీ వెళుతుండటంతో కేంద్రం పెద్దలతో తాను ముందుగానే సమావేశమయ్యేందుకు విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

పోటాపోటీగా…..

తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపిస్తే వైసీపీ నిరసన ప్రదర్శనలకు దిగింది. చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగితే, వైసీపీ 36 గంటల పాటు జనాగ్రహ దీక్షలు చేపట్టింది. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళుతుండటంతో జగన్ కూడా ఢిల్లీ పర్యటన కోసమే తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారంటున్నారు.

Tags:    

Similar News