నేడు వారి ఖాతాల్లోకి నేరుగా పదివేలు

వైఎస్ జగన్ నేడు మరో పథకం కింద లబ్దిదారులకు చెల్లింపులు జరపనున్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం కింద ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని [more]

;

Update: 2020-05-06 01:38 GMT

వైఎస్ జగన్ నేడు మరో పథకం కింద లబ్దిదారులకు చెల్లింపులు జరపనున్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం కింద ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. నేడు ప్రభుత్వం గుర్తించిన మత్స్యకారుల ఖతాల్లో పదివేల రూపాయలు జమ అవుతాయి. చేపల వేటను నిషేధించిన సమయంలో వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం పదివేల రూపాయలను ఇవ్వాలని గతంలో నిర్ణయించింది. ఈ ఏడాది ఈ సాయాన్ని ముందుగానే అమలు చేయాలని నిర్ణయించింది. దాదాపు లక్ష కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. గత ఏడాది నవంబరు నెలలో ఈ సాయాన్ని అందించారు.

Tags:    

Similar News