Ys sharmila : నేడు ఇడుపులపాయకు షర్మిల

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించనున్నారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆమె [more]

;

Update: 2021-10-19 03:10 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించనున్నారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆమె ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. తెలంగాణలోని చేవెళ్ల నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. దాదాపు ఏడాదికి పైగానే ఈ పాదయత్ర కొనసాగనుంది. వైఎస్ ఆశీర్వాదం తీసుకుని షర్మిల తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. వైస్సార్టీపీ ప్రారంభించిన తర్వాత షర్మిల పాదయాత్రను చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం నాలుగువేల కిలోమీటర్ల మేరకు షర్మిల పాదయాత్ర జరగనుంది. ఇడుపుల పాయకు షర్మిలతో పాటు విజయమ్మ కూడా వెళ్లనున్నారు.

Tags:    

Similar News