Ys sharmila : పాదయాత్రకు అంతా సిద్ధం… మరికాసేపట్లో
తెలంగాణలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 400 రోజులు 4 వేల కిలోమీటలర్ల [more]
;
తెలంగాణలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 400 రోజులు 4 వేల కిలోమీటలర్ల [more]
తెలంగాణలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 400 రోజులు 4 వేల కిలోమీటలర్ల మేర వైఎస్ షర్మిల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది. గతంలో వైఎస్ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పుడు తన రికార్డును తానే షర్మిల బద్దలు చేయనున్నారు.
తొలి రోజు పది కి.మీ..
వైఎస్సార్టీపీ ఛీప్ షర్మిల పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజాప్రస్థానం పేరుతో సాగనున్న ఈ యాత్ర తొలిరోజు పది కిలోమీటర్ల మేర సాగనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు చేవెళ్లలోని శంకరపల్లి క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభం కానుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం షర్మిల పాదయాత్ర చేపడతారు. పదికిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం నక్కలపల్లి వద్ద వైఎస్ షర్మిల రాత్రి బస చేస్తారు.