హత్యకు ముందు15 రోజుల కాల్ డేటాయే కీలకం?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాల్ డేటా కీలకంగా మారనుంది. హత్య జరగడానికి పదిహేను రోజులు ముందు కాల్ డేటాను సీబీఐ అధికారులు సేకరించారు. ఈ [more]

Update: 2021-06-20 06:06 GMT

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాల్ డేటా కీలకంగా మారనుంది. హత్య జరగడానికి పదిహేను రోజులు ముందు కాల్ డేటాను సీబీఐ అధికారులు సేకరించారు. ఈ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. వివేకానందరెడ్డి హత్య కేసులో 14 వరోజు సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈరోజు వైఎస్ వివేకా అనుచరుడు ఎర్రగంగిరెడ్డితో పాటు పులివెందులకు చెందిన అశోక్ కుమార్, ఓబులాపతినాయుడు, రాఘవేంద్రలతోపాటు శ్రీరాములు హరినాధరెడ్డిలను విచారిస్తున్నారు. వీరితో పాటు భార్యాభర్తలు సావిత్రి, కృష్ణలను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడానికి పదిహేను రోజుల ముందు వరకూ ఆయన ఎవరెవరితో మాట్లాడరన్నదానిపై క్లారిటీకి వచ్చిన అధికారులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News