ఆ 8 కోట్లు ఇచ్చిందెవరు? ఆ ఇద్దరు ముఖ్యనేతలెవరు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడుతున్నట్లే కన్పిస్తుంది వివేకా హత్యకు 8 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడయింది. ఈ కేసులో మొత్తం 9 [more]

;

Update: 2021-07-23 13:01 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడుతున్నట్లే కన్పిస్తుంది వివేకా హత్యకు 8 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడయింది. ఈ కేసులో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడయింది. వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు పదే పదే ప్రశ్నించారు. వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన కృష్ణయ్య, వాచ్ మెన్ రంగన్న, ఇనయతుల్లాను అనేక సార్లు ప్రశ్నించారు.

9 మంది ప్రమేయం……

వాచ్ మెన్ రంగన్న విచారణల సంచలన విషయాలను వెల్లడించారు. జమ్మలమడుగు మెజిస్ట్రేటు ఎదుట రంగన్న స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. వైఎస్ వివేకాను సుపారీ గ్యాంగ్ హ త్య చేసినట్లు చెప్పాడు. తొమ్మిది మంది పాత్ర ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు రంగన్న వెల్లడించాడు. ఇందులో ఇద్దరి ప్రముఖుల హస్తం కూడా ఉందని రంగన్న తెలిపారు. ఆ ఇద్దరు ఎవరన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆ దిశగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News