వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అలా వదిలేస్తారా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పలువరు పేర్లు వెల్లడించిన వాచ్ మెన్ రంగయ్యకు ప్రాణహాని ఉందని స్థానికులు చెబుతున్నారు. రంగయ్య మీడియాతోనే తాను ముగ్గురి పేర్లను మెజిస్ట్రేట్ [more]
;
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పలువరు పేర్లు వెల్లడించిన వాచ్ మెన్ రంగయ్యకు ప్రాణహాని ఉందని స్థానికులు చెబుతున్నారు. రంగయ్య మీడియాతోనే తాను ముగ్గురి పేర్లను మెజిస్ట్రేట్ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పలువరు పేర్లు వెల్లడించిన వాచ్ మెన్ రంగయ్యకు ప్రాణహాని ఉందని స్థానికులు చెబుతున్నారు. రంగయ్య మీడియాతోనే తాను ముగ్గురి పేర్లను మెజిస్ట్రేట్ కు వెల్లడించానని చెప్పారు. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి ఇంటికి నలుగురు వ్యక్తులు వచ్చారని, వారిలో ముగ్గురిని తాను గుర్తుపట్టానని, నాలుగోవ్యక్తిని గుర్తుపట్టలేనని రంగయ్య తెలిపారు. అయితే మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చిన రంగయ్యను సీబీఐ అధికారులు బస్గాండ్ వద్ద వదిలేసి వెళ్లారు. ఆయన ప్రాణాలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.