వైఎస్ వివేకా హత్య కేసులో నన్ను ఇరికిస్తున్నారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. [more]
;
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. సునీల్ కుమార్ యాదవ్ తో పాటు నలుగురు ఈ పిటీషన్ ను వేశారు. తనతో పాటు తన కుటుంబంలోని మరికొందరిని వైఎస్ వివేకా హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. సీబీఐ విచారణకు సహకరిస్తామని, అయితే తమ న్యాయవాది ఎదుట విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు. సీబీఐ డైరెక్టర్ ను ప్రతివాదులుగా చేర్చారు.