హత్య కేసులో తొలిసారి వాళ్లను ప్రశ్నించనున్న?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాకు చెందిన వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కదిరికి [more]

;

Update: 2021-07-30 05:47 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాకు చెందిన వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కదిరికి చెందిన వైసీపీ నేతలు లోకేష్, గోవర్థన్ లను నేడు విచారణకు హాజరుకానున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు 58వ రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకూ కడప జిల్లాకు చెందిన వారినే విచారించిన సీబీఐ అధికారులు నేడు తొలిసారి అనంతపురం జిల్లా వారిని ప్రశ్నిస్తుండటం విశేషం.

Tags:    

Similar News