వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. వైఎస్ వివేకా బంధువులను సీబీఐ అధికారులు విచారించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి [more]

;

Update: 2021-08-19 02:29 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. వైఎస్ వివేకా బంధువులను సీబీఐ అధికారులు విచారించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఈయన పులివెందుల వైసీపీ ఇన్ ఛార్జిగా కూడా ఉన్నారు. అలాగే భాస్కర్ రెడ్డి సోదరుడు వైఎస్ మనోహర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. దీంతో పాటు వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ కు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం సునీల్ కుమార్ యాదవ్ కడప సెంట్రల్ జైలులో ఉన్నారు.

Tags:    

Similar News