అసెంబ్లీ సమావేశాల్ని రాజకీయం చేయొద్దు : కేసీఆర్

Update: 2016-12-12 23:31 GMT

16వ తేదీనుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలు రాజకీయం అయిపోకుండా చర్చలు అర్థవంతంగా సాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారు. ఈ శీతాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని... కార్యకలాపాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా ఉండాలని ఆయన విపక్షాలను అభ్యర్థిస్తున్నారు. సభలో సభ్యులు లేవనెత్తే ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు అయినా సరే సరైన సమాధానాలతో తెరాస వారంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజా సంక్షేమం దిశగా తమ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఈ అసెంబ్లీ సమావేశాలను వాడుకోవాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి సమీక్షించారు. సభలో ఎలాంటి చికాకులు తలెత్తకుండా తెరాస మంత్రులంతా కూడా తమ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని కూడా కేసీఆర్ చెప్పారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు అందరూ కూడా.. ప్రభుత్వ విధానాలు కార్యక్రమాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని కేసీఆర్ సూచించారు. సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో అధికార పార్టీ వారి సలహాలు, సూచనలను స్వీకరించడానికి సదా సిద్ధంగా ఉంటుందని కూడా కేసీఆర్ అన్నారు. ఎలాగైనా సరే.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను రాజకీయం చేయడానికి వాడుకోకుండా ఉండాలంటూ సభ్యులందరికీ ఓ స్పష్టమైన సంకేతం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Similar News