విదేశాల్లో తెలంగాణ వారికి శుభవార్త!

Update: 2016-12-13 05:08 GMT

బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడ రకరకాల పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది శుభవార్త. వారి విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందాలో నిర్ణయించేందుకు, అవసరమైన సందర్భాలత్లో వారికి ఆప్త హస్తం అందించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తున్నది. ప్రవాస తెలంగాణీయులు (ఎన్ఆర్‌టీ) ల సంక్షేమం కోసం కొత్త విధానానికి రూపకల్పన చేయనుంది.

గల్ఫ్ వంటి దేశాల్లో బతుకుతెరువు కోసం వెళ్లిన వారు అక్కడ చిక్కులు వచ్చిన సందర్భాల్లో చాలా యాతన పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వారికి కాస్త ఆధరవుగా ఉండడమూ, వారు ఇబ్బందుల్లో పడ్డప్పడు ఇక్కడి వారి కుటుంబాలకు భరోసా కల్పించడమూ వంటి లక్ష్యాలతో ఒక నూతన విధానానికి రూపకల్పన జరుగుతోంది.

ఈ విధానంతో నిమిత్తం లేకుండానే.. తెలంగాణ వాసులు ప్రవాసంలో ఉండి ఏదైనా చిక్కుల్లో పడ్డప్పుడు.. వారికోసం ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటూనే ఉంది. కేంద్రంతో సంప్రదించి, వారిని స్వదేశానికి తక్షణం రప్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. సందర్భాన్ని బట్టి స్పందించడంలో తెలంగాణ సర్కారు ముందంజలోనే ఉంటున్నది గానీ ఒక విధానంగా ప్రవాసంలో ఉన్న తెలంగాణీయులకు చేయూత అందించడానికి ఇప్పుడు కృషి చేస్తోంది.

దీనికి సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధం అవుతోంది. కేసీఆర్ దానికి ఆమోదం తెలపగానే అధికారికంగా అమల్లోకి వస్తుంది.

Similar News