Ukraine War : ఆగని దాడులు.. ఇంకా సొంతం కాని కీవ్

యుద్ధం ప్రారంభమై 17 రోజులు గడుస్తున్నా రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధానిని కీవ్ కు చేరుకోలేకపోయాయి

Update: 2022-03-12 02:26 GMT

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం ప్రారంభమై 17 రోజులు గడుస్తున్నా రష్యా సేనలు రాజధానిని కీవ్ కు చేరుకోలేకపోయాయి. నిత్యం దాడులతో విరుచుకుపడుతూ రష్యా సేనలు ముందుకు సాగుతున్నా ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంటుంది. కీవ్ దిశగా రష్యా సేనలు కదులుతున్నాయి. క్షిపణులతో దాడులు చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులతో పరుగులు తీస్తున్నారు.

బంకర్లు వీడి రావద్దని...
ఇప్పటికే దాదాపు 23 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని వీడినట్లు చెబుతున్నారు. ప్రజలు ఎవరూ బంకర్లు వీడి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యా సైన్యం ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించి వాటిని సొంతం చేసుకోవాలని చూస్తుంది. దీంతో లక్షల కోట్ల ఆస్తినష్టం జరగడమే కాకుండా ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అయితే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేందుకు అప్పుడప్పుడు కాల్పులవిరమణను పాటిస్తుండటం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాలి.


Tags:    

Similar News