శవాలు గుట్టలు గుట్టలు
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య నాలుగుసార్లు చర్చలు జరిగినా ఫలితం లేదు. . రష్యా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య నాలుగుసార్లు చర్చలు జరిగినా ఫలితం లేదు. యుద్ధం ఆగలేదు. రష్యా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను ఆక్రమించుకునే దిశగా రష్యా చేస్తున్న ప్రయత్నాలు సామాన్య పౌరులకు ఇబ్బందిగా మారాయి. నివాస ప్రాంతాలపై బాంబు దాడులు చేస్తుండటంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేల సంఖ్యలో మ ృతి చెందుతున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉక్రెయిన్ లో ఉంది.
ఖననం చేసేందుకు....
ఉక్రెయిన్ లోని కీవ్, ఖర్కివ్, మరియపోల్ వంటి నగరాలను ఆక్రమించుకునేందుకు రష్యా ఇప్పటికీ పోరాడుతుంది. 18 రోజుల నుంచి రష్యా ప్రయత్నిస్తున్నా ఉక్రెయిన్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. దీంతో రష్యా సేనలు రెచ్చిపోయి క్షిపణులుతో నగరాల్లో దాడులు చేస్తున్నారు. దీంతో అనేక మంది పౌరులు మృత్యువాత పడుతున్నారు. యుద్ధానికి విరామం కూడా ప్రకటించక పోవడంతో శవాలు ఎక్కడకికక్కడ పడి ఉన్నాయి. వీటిని ఖననం చేసే పరిస్థితి కూడా లేదు.