లెక్క చేయని రష్యా,.. కొనసాగుతున్న దాడులు

అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను రష్యా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్ పై దాడులు ఆపకపోగా మరింత ఉధృతం చేసింది.;

Update: 2022-03-18 01:42 GMT
ukraine war, international court of justice, russia, attacks
  • whatsapp icon

అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను రష్యా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్ పై దాడులు ఆపకపోగా మరింత ఉధృతం చేసింది. ఉక్రెయిన్ పై దాడులు వెంటనే ఆపాలని, సైనిక బలగాలను వెనక్కు రప్పించాలని అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి రష్యా మరింత వేగం పెంచింది. ఉక్రెయిన్ పై దాడులను మరింత ఉధృతం చేసింది. చివరకు నివాస భవనాలను కూడా రష్యా వదిలిపెట్టడం లేదు.

నివాస భవనాలపై....
ఉక్రెయిన్ కు చెందిన ప్రధాన నగరాలను ఆక్రమించుకునేందుకు రష్యా గత ఇరవై రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఉక్రెయిన్ సైన్యం రష్యా సేనలను ధీటుగా ఎదుర్కొంటుంది. రష్యా యుద్ధ నీతిని కూడా పాటించడం లేదు. ఖర్కివ్ కు సమీపంలోని మెరెఫాలో పాఠశాల భవనం పై బాంబు దాడులకు దిగింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.


Tags:    

Similar News