చర్చల్లో కీలక అడుగు.. యుద్ధం ముగింపు దశకు
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరిగిన చర్చల్లో కొంత సానుకూల నిర్ణయాలు వెలువడ్డాయి
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరిగిన చర్చల్లో కొంత సానుకూల నిర్ణయాలు వెలువడ్డాయి. పూర్తి స్థాయిలో చర్చలు ఫలవంతం కాకపోయినప్పటకీ సైనిక దళాలను వెనక్కు తీసుకునేందుకు రష్యా అంగీకరించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. ప్రధానంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్, చెర్ని హైవ్ ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను తగ్గించుకునేందుకు రష్యా అంగీకరించింది.
సైనిక ఉపసంహరణకు...
దీంతో చర్చల్లో కీలక అడుగు ముందుకు పడినట్లేనని అంటున్నారు. సైనికుల ఉపసంహరణతో పాటు శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు ముందుకు వచ్చాయి. రష్యా డిమాండ్లను చాలా వరకూ ఉక్రెయిన్ అంగీకరించింది. నాటో లో చేరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టమైన హామీ ఇచ్చారు. డాన్ బాస్ ప్రాంతంపైన కూడా రాజీ పడతామని చెప్పడంతో చర్చలకు ముందడుగు పడ్డాయి. త్వరలో పుతిన్, జెలెన్ స్కీ సమావేశం కూడా ఉండే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.