ఉక్రెయిన్ సూపర్ మార్కెట్‌పై రష్యా ఎటాక్‌..49 మంది మృతి

ఏళ్లతరబడి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. కొంతకాలం భీకరంగా సాగిన యుద్ధంలో ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ..

Update: 2023-10-06 03:41 GMT

ఏళ్లతరబడి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. కొంతకాలం భీకరంగా సాగిన యుద్ధంలో ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు నేలమట్టమయ్యాయి. వాటిని ఎదుర్కొంటూనే సాధారణ జీవనం ప్రారంభించిన ఉక్రెయిన్‌ బుధవారం దాడితో మళ్లీ ఉలిక్కిపడింది. రష్యా చేసిన మిస్సైళ్ల ఎటాక్‌తో సూపర్‌ మార్కెట్‌ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. తలలు తెగి, చేతులు, కాళ్లు లేకుండా పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌పై మిస్సైళ్లతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నారు. ఈ దాడితో 49మంది మృతి చెందగా, మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 56 మందిని ఉక్రెయిన్ సైనికులు కాపాడారు. మిసైల్‌ ఎటాక్ జరిగిన ప్రాంతంలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రష్యా చేసిన దాడిని ఉక్రెయన్‌ తీవ్రరంగా ఖండించింది. ఈ అంశాన్ని ఉక్రెయన్‌ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామమని చెబుతున్నారు ఉక్రెయిన్ సేనలు.

కాగా,రష్యా సరిహద్దుల్లో ఉన్న కుపియాన్స్క్ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ రాకెట్ దాడి జరిగిందని, గతంలో ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుందని, ఆ తరువాత ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనే రష్యా దళాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని జెలెన్ స్కీ ఆరోపించారు. ఒక సాధారణ దుకాణంపై రాకెట్ దాడి చేసి ప్రజల ప్రాణాలు తీయడం రష్యా చేసిన ఉగ్రవాద దాడి అని విమర్శించారు.
2022 ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అమెరికా, యూకే లాంటి వెస్ట్రన్ దేశాల సహాయంతో ఉక్రెయిన్, రష్యాకు ఎదురొడ్ది పోరాడుతోంది. రష్యా ముందు ఎంతో చిన్నదైన ఉక్రెయిన్ కొన్ని వారల్లోనే లొంగిపోతుందని అంతా భావించినా, ఏడాదిన్నర కాలంగా యుద్ధం జరుగుతూనే ఉంది. పలుమార్లు చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించుకున్న జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను చర్చల్లోకి తీసుకురావద్దని రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నంత కాలం చర్చల ప్రసక్తే లేదని చెబుతోంది.
Tags:    

Similar News