నేడు రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు

ఉక్రెయిన్ - రష్యాల మధ్య శాంతి చర్చలు నేడు జరగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది.

Update: 2022-03-29 02:08 GMT

ఉక్రెయిన్ - రష్యాల మధ్య శాంతి చర్చలు నేడు జరగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా నెల రోజులకు పైగానే దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా దాడుల తీవ్రతను రష్యా తగ్గించింది. యుద్ధాన్ని విరమించలేదని చెప్పేందుకు రష్యా అక్కడక్కడా నామమాత్రపు దాడులు కొనసాగిస్తుందంటున్నారు. ఉక్రెయిన్ బలగాలు కూడా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాయి.

ఇస్తాంబుల్ లో.....
మరోవైపు టర్కీలోని ఇస్తాంబుల్ లో రష్యా - ఉక్రెయిన్ ల మధ్య ఈరోజు చర్చలు జరిగే అవకాశుముందని చెబుతున్నారు. ఇందుకు పుతిన్ కూడా అంగీకరించారని తెలిసింది. ఇప్పటికే అనేక సార్లు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా ఫలవంతం కాలేదు. అయితే ఈరోజు కాల్పుల విరమణ ఒప్పందం జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇరు దేశాలు సైనికులను భారీగా కోల్పోయినందున కాల్పుల విరమణ ఒప్పందానికి మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.


Tags:    

Similar News