నేడు మరోసారి శాంతి చర్చలు

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు నేడు మరోసారి జరగనున్నాయి.

Update: 2022-03-14 01:57 GMT

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు నేడు మరోసారి జరగనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ లో జరగనున్న ఈ చర్చలలో రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యాల మధ్య మూడు సార్లు చర్చలు జరిగాయి. రెండు సార్లు బెలారస్ లో, ఒకసారి టర్కీలో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. కాకుంటే ప్రజలను సురక్షితంగా బయటకు పంపేందుకు సేఫ్ క్యారిడార్ లను ఏర్పాటు చేసే విషయంలో ఇరు దేశాలు ఒక అంగీకారానికి రావడం మినహా మరే పురోగతి లేదు.

షరతులు కంటిన్యూ....
నాటో దేశాల్లో చేరబోమని లిఖితపూర్వకంగా ఉక్రెయిన్ ప్రకటించాలని రష్యా డిమాండ్ చేస్తుంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇప్పటికే నాటోలో చేరబోమని స్పష్టం చేశారు. తమకు లొంగిపోవాలని రష్యా మరోసారి షరతు పెట్టింది. ఉక్రెయిన్ మాత్రం యుద్ధం వెంటనే విరమించాలని కోరుతుంది. ఈ నేపథ్యంలో నేడు సాగుతున్న చర్చలు ఫలప్రదం కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. రష్యా మాత్రం నివాస ప్రాంతాల్లో తన దాడులను కొనసాగిస్తూనే ఉంది.


Tags:    

Similar News