గజరాజా మజాకా.. కోపంతో రగిలిపోయి ఏం చేసిందో చూడండి.. షాకింగ్‌ వీడియో

ఇటీవల కాలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని ఏనుగులు అడవుల నుంచి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు వచ్చి పంటను

Update: 2024-07-09 11:36 GMT

Viral Video

ఇటీవల కాలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని ఏనుగులు అడవుల నుంచి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఓ గజరాజు మాత్రం బీభత్సం సృష్టించింది. ఏనుగుకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంటుంది. ఓ ప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏం కోపం వచ్చింది తెలియదుగానీ.. రోడ్డు పక్కన ఉన్న వాహనాలను సైతం ధ్వంసం చేసేసింది. బైక్‌లు, ఆటోలను సైతం బతిలా ఆడేసింది. ఓ ఆటోను చీల్చి చండాడేసింది. ఈ వీడియో wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ అయ్యింది. అప్పటి నుంచి వైరల్‌ అవుతోంది. ఏనుగుకు వచ్చి కోపాన్ని చూసి అక్కడున్న జనాలు సైతం వణికిపోయారు. ఆ ఏనుగును మావటి ఎంత కంట్రోల్‌ చేసినా ఏ మాత్రం అదుపులోకి రాలేదు. వాహనాలను తొండంతో నేలకు కొట్టింది. సోషల్‌ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.



Tags:    

Similar News