నేటి నుంచి ఏపీలో ఇంటర్ తరగతులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచే 2025-26 ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి;

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచే 2025-26 ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 2025 26 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయి. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్ లో చేరే వారికి వచ్చే 7వ తేదీ నుంచి ప్రవేశాలు మొదలవుతాయని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది.
వేసవి సెలవుల తర్వాత...
వేసవి సెలవులు అనంతరం తిరిగి జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నామి, అలాగే జూనియర్ కళాశాలల పనివేళలను కూడా ఉన్నత విద్యాశాఖ పొడిగిస్తూ ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతుల వేళలను పొడిగించారు. అలాడే ఏడు పీరియడ్లకు బదుదు ఎనిమిది పీరియడ్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అన్ని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.