తణుకులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు
తణుకులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి;

తణుకులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. వివిధ చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాటూరి లక్ష్మణరావు రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయంలో, ఇళ్లలోనూ తనిఖీలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దయెత్తున ఆదాయపు పన్ను చెల్లించడం లేదన్న ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
వైసీపీ నేత ఇంట్లోనూ...
దీంతోపాటు వైసీపీ నేత దుర్గాప్రసాద్ కార్యాలయంలో నూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.