Ap Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు;

Update: 2025-04-03 11:43 GMT
chandrababu, chief minister, cabinet meeting, key issues
  • whatsapp icon

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపి డ్రోన్ కార్పొరేషనను.. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం తెలిపింది. బార్ లైసెన్స్ ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ ఆమోదించింది. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్ కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కూడా ఓకే చెప్పింది.

జలహారతి కార్పొరేషన్ ...
నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గ సమావేశం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయాలని నిర్ణయించింది. అనంతరం చంద్రబాబు మంత్రులు రుషికొండ భవనాలను సందర్శించాలని కోరారు.రుషికొండ భవనాలను ఏం చేయాలన్న దానిపై సూచనలు ఇవ్వాలని కోరారు. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ప్రమాదంపై కేబినెట్‌లో చర్చకు వచ్చింది. చట్టపరంగా విచారణ జరిపినట్లు ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారుర. సున్నిత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ఎలా వివాదాస్పదం చేస్తారో ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News