మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై బుధవారం కేసు నమోదైంది

Update: 2024-12-12 05:23 GMT

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై బుధవారం కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. జయసుధ పేరిట గోడౌన్ ఉంది. దీన్ని సివిల్ సప్లయిస్ శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇందులోని బియ్యం నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు.



బియ్యం నిల్వలు...

185 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్టు అధికారులు తేల్చారు . ఈ కేసులో పేర్ని నాని భార్యపై కేసు నమోదు చేశారు. బియ్యం మాయమయినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. పేర్నినాని సతీమణితో పాటు గోదాము మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు అందింది. అయితే వే బ్రిడ్జి సరిగ్గా పనిచేయలేదని వారుచెబుతున్నారు.షార్టేజీకి సంబంధించినధాన్యం విలువను ప్రభుత్వానికి చెల్లిస్తామని పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారు.



Tags:    

Similar News